
ఐబొమ్మ.. ప్రస్తుతం మొబైల్ యూజ్ చేస్తున్న చాలా మందికి ఈ వెబ్ సైట్ గురించి తెలిసే ఉంటుంది. ఓటీటీలో రిలీజయ్యే సినిమాలను అదే దాదాపు అదే క్వాలిటీతో ఫ్రీగా తమ యూజర్స్ కు అందిస్తోంది ఈ వెబ్ సైట్. దీంతో చాలా మంది ఈ వెబ్ సైట్ దారా సినిమాలు డౌన్లోడ్ చేసుకొని పైసా ఖర్చు లేకుండా కొత్త కొత్త కంటెంట్ ను ఫ్రీగా చూసేస్తున్నారు.
అయితే తాజాగా ఐబొమ్మ ద్వారా డౌన్లోడ్ చేసుకొని సినిమాలు చూడటం అంటే సమస్యల్లో ఇరుక్కున్నట్లే అనే ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఐబొమ్మ వెబ్ సైట్ ను ఎవరు నడుపుతున్నారనే ప్రశ్నకు ఇప్పటివరకు సరైన సమాధానం లేదు.
వాళ్ళు విదేశాల్లో ఉంటారని సమాచారం. ఈ వెబ్ సైట్ డోమేన్ బ్లాక్ చేసినా కూడా.. వెంటనే మరో డొమేన్ బుక్ చేసుకొని మరీ సినిమాలను పోస్ట్ చేస్తున్నారు. ఈ సైట్ వల్ల నిర్మాతలు మోసపోతున్నారన్న విషయం తెలిసి చర్యలు తీసుకోవాలని ప్రయత్నించినా వాళ్లను పట్టుకోవడం సాధ్యపడటంలేదు. అంతే కాదు ఈ ఐబొమ్మ సైట్ నుండి సినిమాలు డౌన్లోడ్ చేయడం వాళ్ళ వైరస్ కూడా డౌన్లోడ్ అయ్యే ప్రమాదం ఉందట. ఈ సైట్ ఓపెన్ చేసే సమయంలో వేరే సైట్స్ లింక్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతూనే ఉంటాయి. వాటి వాళ్ళ కూడా మన డీటెయిల్స్ బయటకు వెళ్లే ప్రమాదం ఉంటుందంట. అందుకే ఐబొమ్మలో సినిమాలు చూడటం ప్రమాదం అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.