తొమ్మిదేండ్ల యోగా గురువు

తొమ్మిదేండ్ల యోగా గురువు

తొమ్మిదేండ్ల వయస్సులో నువ్వు ఏంచేశావని అడిగితే... ‘స్కూల్‌‌కి వెళ్లకుండా ఉండటానికి ఎన్నో  ప్లాన్స్‌‌ వేశా. అవేవి వర్కవుట్‌‌ అవకుంటే ఏడ్చేవాడిని’ లేదా ‘ఫ్రెండ్స్‌‌తో ఆడుకుంటూ, అమ్మచేసే వెరైటీ వంటలు తినడానికి ముందుంటాం’ అని చెప్తారు చాలామంది. కాని ఈ పిలగాడు అలా కాదు.వీళ్లు పిల్లలు కాదు పిడుగులు అని కొంత మంది పిల్లల్ని చూస్తే అనిపిస్తుంది. వాళ్లు చేసే వయసుకు మించిన పనులు అలాంటివి మరి. ఈ పిలగాడు అలాంటోడే. తన తల్లిదండ్రులతో కలిసి రోజూ యోగా చేసేవాడు. ఇప్పుడు చాలామందికి యోగా గురువు అయిపోయాడు. అంతేకాదు చిన్న వయసులో యోగా గురువు అయినందుకు గిన్నిస్‌‌ బుక్‌‌ ఆఫ్‌‌ వరల్డ్ రికార్డ్‌‌లోకి కూడా ఎక్కాడు. పేరు రెయాంశ్​ సురాని. భారత సంతతికి చెందిన వాళ్లే అయినా దుబాయిలో సెటిల్‌‌ అయ్యారు. తన పేరెంట్స్‌‌తో కలిసి నాలుగేండ్ల వయస్సులోనే రిషికేష్‌‌లో యోగా ట్రెయినింగ్‌‌  తీసుకున్నాడు. అంతేకాదు 200 గంటల యోగా టీచర్‌‌‌‌ ట్రైనింగ్‌‌ కోర్స్‌‌ను ఆనంద్‌‌ శేఖర్‌‌‌‌ యోగా స్కూల్‌‌ ద్వారా 2021లోనే పూర్తిచేసి సర్టిఫికెట్‌‌ కూడా తీసుకున్నాడు. అంతేకాకుండా యోగాలో అలైన్‌‌మెంట్, అనాటమిక్‌‌ ఫిలాసఫీ, న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్‌‌ ఆఫ్‌‌ ఆయుర్వేద అనే వాటిని కూడా నేర్చుకున్నాడు. రోజూ సెషన్లవారీగా బయట, వాళ్ల స్కూల్‌‌లో ప్రైవేట్‌‌ క్లాస్‌‌లు కూడా తీసుకుంటున్నాడు ఈ ప్రొఫెషనల్‌‌ ట్రైనర్‌‌‌‌. ‘మొదట్లో నేను యోగా అంటే శరీర భంగిమలు, శ్వాస తీసుకొని వదలడం అంతే అనుకున్నా. కాని వాటికన్నా ఎక్కువ ఉంటాయి ఇందులో’ అంటాడు రెయాంశ్​.