బాంబే ఐఐటీలో స్టూడెంట్ సూసైడ్.. పరీక్షల్లో చాట్ జీపీటీతో కాపీ కొడ్తూ పట్టుబడ్డ విద్యార్థి

బాంబే ఐఐటీలో స్టూడెంట్ సూసైడ్.. పరీక్షల్లో చాట్ జీపీటీతో కాపీ కొడ్తూ పట్టుబడ్డ విద్యార్థి
  • సాయంత్రం హాస్టల్​లో ఆత్మహత్య

ముంబై: ఐఐటీ బాంబే క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఎగ్జామ్ టైంలో ఫోన్ లోని చాట్ జీపీటీ ఉపయోగించి ఆన్సర్లు కాపీ కొడుతూ పట్టుబడిన ఓ స్టూడెంట్.. సాయంత్రం క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉరి వేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఐఐటీ బాంబేలో సాహిల్ వాకోడే(22) అనే విద్యార్థి ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో సెకండియర్ చదువుతున్నాడు. శుక్రవారం జరిగిన పరీక్షకు తన మొబైల్ ఫోన్​తో అటెండ్ అయ్యాడు. పరీక్ష ప్రశ్నపత్రాన్ని చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీపీటీలో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసి జవాబులు వెతికే ప్రయత్నం చేస్తుండగా అధికారులకు దొరికిపోయాడు. ఈ ఘటనపై కోర్సు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్టర్, విభాగాధిపతి సాహిల్తో మాట్లాడారు. మరొకసారి ఇలా కాపీకి పాల్పడవద్దని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత విద్యార్థి తన గదికి వెళ్లిపోయాడు. కానీ, సాయంత్రం అతడు పోవై క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హాస్టల్లో సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

ఐఐటీ క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆందోళన

ఈ ఘటనతో ఐఐటీ క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. గత 7 నెలల వ్యవధిలో ఐఐటీ బాంబేలో ఇది మూడో ఆత్మహత్య కావడంతో పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనకు దిగారు. పరీక్షలో కాపీ కొట్టాడనే నెపంతో కళాశాల యాజమాన్యం సాహిల్ ను ఏడాది పాటు సస్పెండ్ చేస్తామని బెదిరించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.