ఐఐటీ ఢిల్లీలో ప్రాజెక్ట్​ అసిస్టెంట్ పోస్టులు..బీటెక్ పాసైతో చాలు

ఐఐటీ ఢిల్లీలో  ప్రాజెక్ట్​ అసిస్టెంట్  పోస్టులు..బీటెక్ పాసైతో చాలు

జూనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ, ఢిల్లీ(ఐఐటీ ఢిల్లీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల ​అభ్యర్థులు ఐఐటీ ఢిల్లీ అధికారిక వెబ్​సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ మే 19. 
 పోస్టులు: 2 (జూనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్)
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్/ బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: మే 19. 
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు iitd.ac.in వెబ్​సైట్​​లో సంప్రదించగలరు.