చంద్రయాన్ 2 : ప్రజ్ఞాన్ రోవర్‌కు టెక్నాలజీ అందించిన IIT కాన్పూర్

చంద్రయాన్ 2 : ప్రజ్ఞాన్ రోవర్‌కు టెక్నాలజీ అందించిన IIT కాన్పూర్

ఇస్రో ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయోగం చంద్రయాన్ 2  మరికొద్దిగంటల్లోనే ప్రారంభం కాబోతోంది. జాబిల్లి జాడ వెతుకుతూ… ఇస్రో పంపిన రాకెట్ చంద్రున్ని తాకనుంది. ఆర్బిటార్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను చంద్రునిపైకి పంపిస్తున్నారు. ప్రజ్ఞాన్ రోవర్ కు సంబంధించిన సాంకేతిక సహాయాన్ని ఐఐటీ -కాన్పూర్ అందించింది.

రోవర్ లో మ్యాపింగ్ జెనరేషన్ సాఫ్ట్ వేర్ ను ఐఐటీ కాన్పూర్ క్యాంపస్ కు చెందిన 10 మంది ఫ్యాకల్టీ, విద్యార్థుల బృందం రూపొందించి. అల్గారిథమ్ తయారు చేసేందుకు మూడేళ్ల కష్టపడింది ఐఐటీ కాన్పూర్ టీమ్.

చంద్రయాన్ 2లో అత్యంత కీలకమైన మాడ్యూల్ రోవర్. ల్యాండర్ చంద్రునిపైకి సురక్షితంగా దిగిన తర్వాత… రోవర్ తన పని మొదలుపెడుతుంది. ఈ రోవర్ లో మ్యాప్ జెనరేషన్, పాత్ ప్లానింగ్ సబ్ సిస్టమ్స్ ను ఐఐటీ కాన్పూర్ రూపొందించిందని ప్రొఫెసర్ ఆశిష్ దత్తా చెప్పారు. ప్రొటోటైప్ స్ట్రక్చర్ ఎలా ఇచ్చారో… అలాగే రూపొందించామని చెప్పారు.