శశాంత్ ఆస్పత్రిలో యువకుడి మృతి.. బంధువుల ఆందోళన

శశాంత్ ఆస్పత్రిలో యువకుడి మృతి.. బంధువుల ఆందోళన

నిజామాబాద్, వెలుగు: వెన్నునొప్పితో బాధపడుతూ ఆపరేషన్​ కోసం నగరంలోని శశాంత్​ హాస్పిటల్​లో చేరిన కెతావత్​ భాస్కర్​ (19) ఆదివారం మృతిచెందాడు. ఆపరేషన్​ కోసం సిద్ధం చేస్తున్న టైంలో అనెస్థీషియా మోతాదుకు మించి ఇవ్వడంతోనే భాస్కర్​చనిపోయాడని ఆరోపిస్తూ పేరెంట్స్, బంధువులు ఆందోళన చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలం సిద్ధాపూర్ కు చెందిన భాస్కర్​ చదువులో ప్రతిభ కనబర్చడంతో మద్రాస్​ ఐఐటీలో సీట్​ కన్ఫర్మ్​ అయింది. 

కాగా, కొంతకాలంగా వెన్నునొప్పి ఇబ్బంది పెడుతుండడంతో ట్రీట్మెంట్ తీసుకొని వెళ్లడానికి శనివారం తల్లిదండ్రులు, బంధువుల సహాయంతో నగరంలోని హాస్పిటల్​ వచ్చాడు. ఆపరేషన్​ చేస్తే సమస్య తీరుతుందని డాక్టర్లు చెప్పడంతో అడ్మిట్​అయ్యాడు. ఆదివారం ఆపరేషన్​ కోసం డాక్టర్లు థియేటర్​లోకి తీసుకెళ్లగా, బయటకు వచ్చి అతడు మృతిచెందాడని చెప్పడంతో వారు షాక్​ అయ్యారు. మత్తు మందు డోస్​ ఎక్కువ ఇవ్వడం వల్లే భాస్కర్​ మృతి చెందాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి సముదాయించారు.