హైదరాబాద్, వెలుగు: ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ (ఐఐటీఎమ్) పేరుతో నిర్వహిస్తున్న ట్రావెల్ ఎగ్జిబిషన్ హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో గురువారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు (డిసెంబర్ 4–6) జరిగే ఈ ఈవెంట్, భారతీయ, అంతర్జాతీయ ప్రయాణ రంగాల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ప్రదర్శనలో 25 రాష్ట్రాలు, 10 దేశాల నుంచి 200కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు.
ప్రభుత్వ ట్రావెల్, హాస్పిటాలిటీ కంపెనీలతో పాటు విదేశీ పర్యాటక సంస్థలు కూడా స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఇది బీ2బీ, బీ2సీ నెట్‌వర్కింగ్, భాగస్వామ్యాలకు అవకాశాలను అందిస్తుంది. లీజర్, అడ్వెంచర్, మీటింగ్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ ఎగ్జిబిషన్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, మెడికల్ టూరిజం ప్రొడక్టులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. కొత్త ప్యాకేజీలు, టెక్నికల్ సొల్యూషన్స్, తాజా ట్రెండ్‌ల గురించి సందర్శకులు తెలుసుకోవచ్చు.
