జీడిమెట్ల, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమానికి తమ యూనియన్ నిబద్ధతతో పనిచేస్తోందని టీయూడబ్ల్యూజే – ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. షాపూర్‌నగర్ శుభం హోటల్లో సోమవారం జరిగిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ఆయన గెస్ట్‌గా హాజరయ్యారు. త్వరలోనే ఆక్రిడిటేషన్, హెల్త్‌కార్డులు, ఇతర జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గొలిపెల్ల దయాకర్, యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాల్‌రాజ్, రాష్ట్ర కోశాధికారి మోతే వెంకట్రాంరెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
