దంతాలపల్లి, వెలుగు: రైతులు దళారుల చేతిలో మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంతోపాటు రామాంజపురం, పెద్ద ముప్పారం గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్లను ఆయన ప్రారంభించారు.
నిర్వాహకులు తూకం, తేమ శాతంలో గాని రైతులను మోసం చేసి ఇబ్బందుల గురిచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొర్రూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బట్టు నాయక్, తహసీల్దార్ సునీల్, మండల వ్యవసాయ అధికారి పి వాహిని, సీసీలు, రైతులు పాల్గొన్నారు.
