
సూపర్ రాజా హీరోగా నటిస్తూ దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు’. చందన పాలంకి హీరోయిన్. సెప్టెంబర్ 19న సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూపర్ రాజా మాట్లాడుతూ ‘క్రియేటివిటీనే బ్యాక్‌గ్రౌండ్‌గా, కసినే బలంగా మార్చుకుంటే సినీ ఇండస్ట్రీలో అద్భుతాలు చేయొచ్చు.
సింగిల్ టేక్‌లో ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ జర్నీలో నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. ఇదొక స్పెషల్ మూవీ అని, ఇందులో నటించడం హ్యాపీగా ఉందని హీరోయిన్ చందన చెప్పింది. ఈ చిత్రం ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని ఇందులో నటించిన వంశీ గోనె అన్నాడు.
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ మాట్లాడుతూ ‘సూపర్ రాజా ఎంతోమంది యువతకు ఇన్‌స్పిరేషన్ అవుతారు. సింగిల్ టేక్‌లో తీసిన ఈ సినిమా చూసి షాక్ అయ్యా. మంచి కంటెంట్ ఉంది కాబట్టే రిలీజ్ చేయడానికి ముందుకొచ్చాం’ అని అన్నారు.