
ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఇలియాన.. బర్ఫీ సినిమాతో బాలీవుడ్‌కు వెళ్లింది. ఆ తర్వాత రవితేజ సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోని’ మినహా... సౌత్‌లో ఆమె సినిమాలు చేసి చాలా కాలమైంది. దక్షిణాది సినిమాల్లో ఎందుకు నటించట్లేదు అనే కారణాలను ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘2012లో అనురాగ్ బసు తీసిన ‘బర్ఫీ’లో నటించా. అప్పటికి సౌత్‌లో నేను చాలా బిజీ. కానీ ఆ కథ చాలా నచ్చింది. దాన్ని వదులుకోవడం తెలివితక్కువతనం అనిపించింది. అందుకే ఒప్పుకున్నా.
నేను అనుకున్నట్టుగానే సినిమా హిట్ అయింది. కానీ నేను సౌత్‌ను వదిలేసి బాలీవుడ్‌కు షిప్ట్ అయ్యానని అక్కడి ఫిల్మ్ మేకర్స్ అనుకున్నారు. అంతేకాదు దక్షిణాది చిత్రాల్లో ఇకపై నటించనని కూడా భావించారు. ఆ అపోహతోనే నాకు అవకాశాలు ఇవ్వడం మానేశారు. బాలీవుడ్‌కు వెళ్లాక సినిమాల ఎంపిక విషయంలో నాలో మార్పు వచ్చింది. సెలక్టివ్‌గా మారాను. ఏ పనిచేసినా నిజాయితీగా చేస్తా.
నా క్యారెక్టర్‌కు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడానికి ప్రయత్నిస్తా. కానీ ఇన్నేళ్లలో నాకు ఇక్కడ రావాల్సినంత గుర్తింపు రాలేదు అనిపిస్తుంది’ అని చెప్పింది. మొత్తానికి బాలీవుడ్ లో సరైన గుర్తింపు రాకపోగా, సౌత్ నుంచి రావాల్సిన అవకాశాలు రాక కెరీర్‌లో స్ట్రగుల్ అయ్యానని చెప్పింది ఇలియాన. మరి ఇప్పటికైనా అపోహలు సమసిపోయి, సౌత్ నుంచి ఆఫర్స్ వస్తాయేమో చూడాలి!