ఉజ్బెకిస్తాన్ యువతులతో అసాంఘిక కార్యకలాపాలు.. బంజారాహిల్స్ఆర్ ఇన్ హోటల్ అడ్డా

ఉజ్బెకిస్తాన్ యువతులతో అసాంఘిక కార్యకలాపాలు.. బంజారాహిల్స్ఆర్ ఇన్ హోటల్ అడ్డా
  • ఇద్దరు ఆర్గనైజర్స్​ అరెస్ట్​..
  • ప్రజ్వల హోంకు యువతుల తరలింపు  

జూబ్లీహిల్స్ , వెలుగు : బంజారాహిల్స్​రోడ్​నంబర్​12లో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్న  ఇద్దరు నిందితులను టాస్క్ ఫోర్స్, బంజరా హిల్స్ పోలీసులు అరెస్ట్​చేసి రిమాండ్​కు తరలించారు. టాస్క్​ఫోర్స్​ అడిషనల్​డీసీపీ ఎం. ఇక్బాల్ సిద్దిఖీ కథనం ప్రకారం..కొంతకాలంగా రోడ్ నెంబర్12 లోని ఆర్ఇన్ హోటల్​లో ఎండీ షరీఫ్, ముజీబ్ లు కలిసి ఉజ్బెకిస్తాన్​చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. 

ఈ విషయం తెలుసుకున్న కమిషనర్ టాస్క్ ఫోర్స్ , బంజారాహిల్స్ పోలీసులు కలిసి ఆర్ ఇన్ హోటల్ లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రెండు గదుల్లో ముగ్గురు ఉజ్బెకిస్తాన్​మహిళలు, ఏడుగురు విటులు పట్టుబడ్డారు. ఆర్గనైజర్​మొహమ్మద్ షరీఫ్ సిటీలో స్టైల్​మేకర్​సెలూన్​నిర్వహిస్తూ సెక్స్​రాకెట్​నడుపుతున్నాడు. 

సెలూన్​నడుపుతున్న టైంలో నిరుద్యోగ మహిళలకు మంచి జీతం, కమీషన్ల ఆశ చూపి వ్యభిచారం కోసం తీసుకువస్తున్నాడు. నిందితుల నుంచి రూ.5,950 నగదు, 13 సెల్ ఫోన్లు స్వాధీనం చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు. విదేశీ మహిళలను ప్రజ్వల హోమ్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంజరా హిల్స్ పోలీసులు తెలిపారు. ఈ రైడ్​లో ఇన్​స్పెక్టర్​యదేందర్, ఎస్​ఐ రవిరాజ్​ పాల్గొన్నారు.