
గండిపేట, వెలుగు: మణికొండ మున్సిపాలిటీ చిత్రపురి కాలనీలోని రోహౌస్‌లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను మున్సిపల్ అధికారులు మంగళవారం కూల్చివేశారు. టౌన్‌ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ ఆధ్వర్యంలో రాయదుర్గం పోలీసులు, హెచ్‌ఎండీఏ అధికారుల సమక్షంలో ఒక బిల్డింగ్ కూల్చివేశారు. మరో నిర్మాణాన్ని కూడా కూల్చివేసేందుకు ఉపక్రమించగా, అందులో సామాన్లు ఉన్నాయని యజమాని కోరడంతో వాటిని తొలగించుకోవాలని సూచించారు. బుధవారం తిరిగి ఈ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేయనున్నారు.