కటింగ్ ప్లేయర్‌లో బంగారం రవాణా..

కటింగ్ ప్లేయర్‌లో బంగారం రవాణా..
  • పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
  • శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 2.5 కేజీల బంగారం స్వాధీనం

హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో బుధవారం భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన కొంతమందిని కస్టమ్స్ అధికారులు సోదా చేయగా భారీగా బంగారం బయటపడింది. బంగారం అక్రమ రవాణా చేయడం కోసం స్మగ్లర్లు కొత్త కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. అయినా కూడా వారి ప్రయత్నాలను కస్టమ్స్ అధికారులు చిత్తు చేస్తున్నారు. బుధవారం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన అయిదుగురు ప్రయాణీకుల నుంచి రూ. 1.15 కోట్ల విలువ చేసే 2.5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని మిక్సర్ గ్రైండర్ మోటార్, వైర్లు కట్ చేసే కటింగ్ ప్లేయర్లలో దాచి రవాణా చేసేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో అయిదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. వారి పాస్‌పోర్ట్‌ను సీజ్ చేసి విచారిస్తున్నారు.