ఎల్బీ నగర్ లో పార్కు స్థలం అక్రమ రిజిస్ట్రేషన్

ఎల్బీ నగర్ లో  పార్కు స్థలం అక్రమ రిజిస్ట్రేషన్

ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీ నగర్ నియోజకవర్గం బీఎన్​ రెడ్డి నగర్ డివిజన్ శ్రీపురం కాలనీలో ఛత్రపతి శివాజీ  పార్కును కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బీఎన్​ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దులచ్చిరెడ్డి ఆరోపించారు. సోమవారం వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్​, జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రజావసరాల కోసం ఉంచిన పార్కును అక్రమంగా రిజిస్ట్రేషన్​ చేశారన్నారు. శ్రీపురం కాలనీలో సుమారు 20 వరకు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. విచారణ జరిపి అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు  చేస్తామన్నారు.