పోతంగల్ మండలంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లు సీజ్

పోతంగల్ మండలంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లు సీజ్

కోటగిరి, వెలుగు: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్లను రెవెన్యూ అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగించగా సీజ్​ చేసినట్లు తహసీల్దార్​గంగాధర్​ వెల్లడించారు. పోతంగల్ మంజీరా పరివాహక ప్రాంతం నుంచి రాత్రుల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం మేరకు శనివారం రాత్రి దాడులు నిర్వహించామన్నారు.

 కోటగిరి మండలం వల్లభాపూర్ గ్రామ శివారులో మూడు టిప్పర్లను పట్టుకున్నట్లు తెలిపారు. పోతంగల్ మండలం సోంపూర్ గ్రామ శివారులో అక్రమంగా డంప్​ చేసిన 15 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్​ వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ సయ్యద్ హుస్సేన్, ఏఎస్ఐ బన్సీలాల్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.