పద్మారావునగర్, వెలుగు : మెట్టుగూడ సర్కిల్-44 డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం బుధవారం సీతాఫల్‌మండి, లాలాపేట్ ప్రాంతాల్లో పలు అక్రమ నిర్మాణాలను సీజ్చేసింది.
సీతాఫల్‌మండిలోని వీరమాచినేని స్కూల్వెనుక అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను, లాలాపేట్ పరిధిలోని పలు అక్రమ కట్టడాలను సీజ్ చేశారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీసాయిబాబా, టీపీబీఓ శ్రీ సత్యవర్ధన్ సాగర్ పాల్గొన్నారు.
