భట్టి విక్రమార్కకు అస్వస్థత..పాదయాత్రకు బ్రేక్

 భట్టి విక్రమార్కకు అస్వస్థత..పాదయాత్రకు బ్రేక్

కాంగ్రెస్ సీనియర్ నాయకులు..సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కు తాత్కాళికంగా బ్రేక్ పడింది. పాదయాత్రలో భట్టి విక్రమార్క   స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా  నవాబ్ పేట మండలం రుక్కంపల్లి వద్ద పాదయాత్ర చేస్తుండగా..  భట్టి విక్రమార్క  అస్వస్థతకు లోనయ్యారు.

 భట్టి విక్రమార్కకు  వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు... ఆయనకు షుగర్ లెవెల్స్  తగ్గినట్లు నిర్ధారించారు. ఎండలకు  వందల కిలోమీటర్లు నడవడం వల్ల ఫ్లూయిడ్స్ బాగా తగ్గాయన్న  చెప్పారు.  వడ దెబ్బ, డీ హైడ్రేషన్ వల్ల 48 గంటల పాటు భట్టి విక్రమార్కకు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో మే 19, 20 తేదీల్లో పాదయాత్రకు విరామం ప్రకటించారు భట్టి విక్రమార్క.