
మెటా మరో ఏఐ ఫీచర్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. అదే ‘ఇమాజిన్ మి’. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫొటోలు, టెక్స్ట్ ప్రాంప్ట్‌లతో వెరైటీ స్టయిల్, డిఫరెంట్ రోల్స్, కొత్తకొత్త ప్లేస్ల్లో తమను తాము ఎలా ఇమాజిన్ చేసుకుంటే ఆ విధంగా ఏఐ జనరేట్ చేసి చూపిస్తుంది. ఇది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి యాప్‌లలో అందుబాటులో ఉంది. ఇమాజిన్ మి అనేది మెటా ఏఐ చాట్బాట్లో విలీనం అయిన ఒక పవర్ఫుల్ ఇమేజ్ జనరేషన్ టూల్.
ఇది నార్మల్ టెక్స్ట్ టు ఇమేజ్ ఏఐల కంటే డిఫరెంట్‌గా పనిచేస్తుంది. యూజర్లు ఇచ్చే టెక్స్ట్ ప్రాంప్ట్‌తో పాటు ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌ను కూడా పరిశీలించి అచ్చం మీ పోలికలతోనే ఒక కొత్త ఇమేజ్ను క్రియేట్ చేస్తుంది. ఈ టూల్‌ని ఎలా వాడాలంటే.. మెటా ఏఐ చాట్‌ను ఓపెన్ చేయాలి. ఆ చాట్‌లో/imagine అని టైప్ చేసి తర్వాత మీకు కావాల్సిన ఇమేజ్ ఎలా ఉండాలో వివరిస్తూ టెక్స్ట్ ఇవ్వాలి.
మీ ఫేస్‌ని ముందు, ఎడమ, కుడివైపుల మూడు సెల్ఫీలు అప్లోడ్ చేయాలి. ఇవన్నీ ఇచ్చిన కొన్ని సెకన్లలోనే ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసి చూపిస్తుంది. అంతేకాదు.. ఇమాజిన్ విత్ ఏఐ వాటర్ మార్క్ అనే టూల్ కూడా వాడొచ్చు. ఒకవేళ ఆ ఇమేజ్ నచ్చకపోతే ఎడిట్, రీజనరేట్, డిలీట్ కూడా చేయొచ్చు.