Weather Alert: ఏపీలో మండుతున్న ఎండలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..

Weather Alert: ఏపీలో మండుతున్న ఎండలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..

ఏపీలో గత కొద్దిరోజులు శాంతించిన భానుడు మళ్ళీ ఉగ్రరూపం చూపిస్తున్నాడు.ఒక పక్క పెరిగిన ఉష్ణోగ్రతలు మరో పక్క తీవ్ర వడగాల్పులు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత పెరిగిన నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇవాళ 195 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 147 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది.రాయలసీమ, కోస్త జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ. 

రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు కోస్తా, రాయలసీమ జిల్లాలో ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని తెలిపింది వాతావరణ శాఖ. ఉదయం 11గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. ఎండా దెబ్బ తగలకుండా టవల్, టోపీ, గొడుగు వాడాలని, కాటన్ దుస్తులు ధరించాలని, చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించింది వాతావరణ శాఖ.