ఉరుము, మెరుపు లేకుండా హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం

ఉరుము, మెరుపు లేకుండా హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం

శుక్రవారం ( అక్టోబర్ 24 ) హైదరాబాద్ లో ఉన్నట్టుండి వర్షం దంచికొట్టింది. ఉరుము, మెరుపు లేకుండా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, లక్డికాపూల్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. పలు ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని సూచించింది వాతావరణ శాఖ.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు వీచే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్​ జారీ చేసింది. 

శుక్రవారం.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఎల్లో అలెర్ట్​ జారీ చేసింది. 

►ALSO READ | మియాపూర్లో బస్సు మిస్సైతే ఛేజింగ్ చేసి మూసాపేట్లో ఎక్కాడు.. గాయాలతో బయట పడిన బీటెక్ స్టూడెంట్

వాయుగుండం కారణంగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షఆలు కురిసే ఛాన్స్​ ఉంది. 

శనివారం తెలంగాణలోని కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్​ ఉందని తెలిపింది. 

 అల్పపీడనం, వాయుగుండం కారణంగా తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలో ఉరుములు, మెరుపులు, గంటకు 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం, భారీ వర్షాలు కురుస్తాయని  ప్రజలు అప్రమత్తంగా ఉందని  వాతావరణ శాఖ హెచ్చరించింది.