Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా.. మరో మూడు గంటలు నాన్ స్టాప్ వర్షం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా.. మరో మూడు గంటలు నాన్ స్టాప్ వర్షం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

గత మూడురోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల రోడ్లు చెరువులను తలపించగా.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు శనివారం ( సెప్టెంబర్ 27 ) కూడా కొనసాగనున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ మరో మూడు గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ ఉండచ్చని తెలిపింది వాతావరణ శాఖ. పలు చోట్ల తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్:

ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ తదుపరి రెండు, మూడు గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది