ఏపీలో వచ్చే ఐదు రోజులు కుండపోత వర్షాలు : బంగాళాఖాతంలో ద్రోణి

ఏపీలో వచ్చే ఐదు రోజులు కుండపోత వర్షాలు : బంగాళాఖాతంలో ద్రోణి

ఉత్తర ఆంధ్రప్రదేశ్ , దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం  వాయువ్య దిశగా కొనసాగుతోంది. . దీని ప్రభావంతో  మరో  ఐదు రోజులపాటు ( జులై 25 నుంచి) ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ  హెచ్చరికలు జారీ చేసింది.

ఉత్తర  కోస్తాలోని కొన్నిప్రాంతాల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పెరిగే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ప్రాంతంలో అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని ఒక ప్రకటనలో సూచించారు. ఇంకా ఐదు రోజుల పాటు ( జులై 25 నుంచి)  ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ  తెలిపింది.

వానలే .. వానలు

ఉత్తర ఆంధ్రప్రదేశ్ , దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో ( జులై 26 వ తేదీ)  అల్పపీడనంగా మారే అవకాశం ఉంది, దీని ఫలితంగా రాబోయే ఐదు రోజుల పాటు ( జులై 25 నుంచి) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. 

మెరుపులు... పిడుగులు

ఉత్తర, దక్షిణ తీర ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులతో కూడిన  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. విజయవాడ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో సోమవారం ( జులై 24 నుంచి) ఎడతెరిపి లేకుండా  వర్షాలు కురుస్తున్నాయి.