పెరుగుతున్న ఎండ‌లు.. 31 డిగ్రీల వ‌ర‌కు న‌మోదు.. ఆరోగ్యం జాగ్ర‌త్త‌

పెరుగుతున్న ఎండ‌లు.. 31 డిగ్రీల వ‌ర‌కు న‌మోదు.. ఆరోగ్యం జాగ్ర‌త్త‌

వర్షాలు క్రమేణా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉక్కపోతతో పబ్లిక్ కి ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు 20 వరకు ఈ పరిస్థితి తప్పకపోవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 

వర్షాలు తగ్గడంతో ఎండలు పెరుగుతున్నాయని వివరించింది. 31 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుండటంతో ప్రజలు జాగ్రత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

తేలికపాటి వర్షాలు..

వేడి గాలుల ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 11 వరకు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్, వరంగల్ ​నగరాలు ముంపు ముప్పును ఎదుర్కున్నాయి. 

మొన్నటి వరకు 15 రోజులపాటు వర్షాలు, తక్కువ ఉష్ణోగ్రత, చలి వాతావరణం ఉండి.. ఇప్పుడు ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగటంతో ఇబ్బంది పడుతున్నారు జనం. పొడి వాతావరణంతోపాటు ఎండ తీవ్రత, ఉక్కబోత ఉండటంతో.. తలనొప్పి, జ్వరం, దగ్గు, జలుబు లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికితోడు మంచినీళ్లు మారటం, కలుషితం కావటంతో వాంతులు, విరోచనాలు వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు జనం.