హైదరాబాద్ లో వర్షం.. రాబోయే రెండు రోజులూ భారీ వానలు

హైదరాబాద్ లో వర్షం.. రాబోయే రెండు రోజులూ భారీ వానలు

హైదరాబాద్ సిటీలో వర్షం పడుతుంది. 2024, జూన్ 21వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం నుంచి జోరు వాన పడింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావటంతో.. కొద్దిపాటి ఉక్కబోతగా ఉంది. హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా వర్షం పడింది. ఎల్బీ నగర్, అబిడ్స్, బషీర్ బాగ్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో వర్షంతో వాహనాలు నిదానంగా సాగుతున్నాయి.

రాబోయే 2 రోజులు వానలే వానలు : 

హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా రాబోయే రెండు రోజులు అంటే.. జూన్ 22, 23వ తేదీలు కూడా వర్షాలు పడున్నట్లు అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వాతావరణం భయాందోళనగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. 

ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. గరిష్ఠంగా 33 డిగ్రీలు నమోదు అవుతుండగా.. హైదరాబాద్ సిటీ మాత్రం 35 డిగ్రీలుగా నమోదు కావొచ్చని వివరించింది వెదర్ డిపార్ట్ మెంట్.