
గత కొన్ని రోజులు భారీ వర్షాలు ముంచత్తుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో కూడా భారీ నుంచి అతిభారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, మిజోరాం, త్రిపురం, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం ఆగస్టు7,2024 నాడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
హిమాచల్ ప్రదేశ్ కు ఐఎండీ ఆకస్మిక వరద హెచ్చరిక
హిమాచల్ ప్రదేశ్ లోని పది జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాని ఐఎండీ అరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలతో ఆకస్మిక వరద ప్రమాదంఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
బిలాస్ పూర్ , చంబా, హమీన్ పూర్, కాంగ్రా, కులు, మండి, సిమ్లా, సిర్మౌర్, సోలన్, ఉన్నా ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని ఐఎండీ తెలిపింది.