ఏపీకి చల్లని కబురు.. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

ఏపీకి చల్లని కబురు.. రాష్ట్రంలోకి  ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రుతుపవనాలు తిరుపతి జిల్లాలోని శ్రీహరి కోట సమీప ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్‌ తదితర ప్రాంతాలపై విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో మరిన్ని ప్రాంతాలకు ఈ రుతుపవనాలు విస్తరిస్తాయని, ఆ ప్రభావంతో జల్లులు పడే అవకాశాముందని ఐఎండీ వెల్లడించింది.

తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

రాష్ట్రంలో రాబోవు 3రోజులు తేలికపాటు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆది, సోమ, మంగళ వారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.