తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్

తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్

హైదరాబాద్ తో పాటు  పలు జిల్లాలో  మూడు గంటలుగా వర్షం దంచికొట్టింది. తేలీక పాటి నుంచి అక్కడక్కడ భారీ వర్షం పడింది.  శేర్లింగంపల్లి, లింగంపల్లిలో అత్యధికంగా 4  సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.  ఇక   భద్రాద్రి కొత్తగూడెంలోని మద్దుకూరు  10 సెం.మీ.. యాదాద్రి భువనగిరి లోని నారాయణపూర్ లో  7.6 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.

మరో వైపు మరో మూడు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్నాటక, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పైగా ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు.. అక్కడక్కడ భారీ  వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంతేగాకుండా ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.

వచ్చే రెండు మూడు రోజులు హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, నారాయణ పేట, రంగారెడ్డి జిల్లాల్లోలతో పాటు  మేడ్చల్‌ మల్కాజిగిరి, వరంగల్‌, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. 

 హైదరాబాద్ లో నమోదైన వర్షపాతం.. గత మూడు గంటల్లో

 •  చందానగర్ 3.5  సెం.మీ
 •  మూసాపేట్ 2.6
 • గచ్చిబౌలి 2.4 
 •  ఆర్సిపురం 1.9 
 •  మాదాపూర్ ,బోరబండలో 1.6 
 • కూకట్ పల్లి,  ఖైరతాబాద్ కాప్రా,  ఉప్పల్ షేక్ పేట, పటాన్ చెరులో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదయ్యింది

 జిల్లాల్లో నమోదైన వర్షపాతం

 • భద్రాద్రి కొత్తగూడెంలోని మద్దుకూరు  10 సెం.మీ
 •  యాదాద్రి భువనగిరిలోని నారాయణపూర్ లో  7.6
 •  నల్గొండ లోని పుల్లెంల  లో 5.2
 •  ఖమ్మంలోని నాగులవంచలో 5 సెం.మీ
 •  నల్గొండ లోని ముదుగులపల్లిలో 4.7
 •  ఖమ్మంలోని తిమ్మారావుపేటలో 4.6
 •  ములుగు లోని అలుబాకలో 4.2