ఏరోబిక్స్​తో రోగనిరోధక శక్తి

ఏరోబిక్స్​తో రోగనిరోధక శక్తి

ఏరోబిక్​ ఎక్సర్​సైజ్​లు.. అంటే స్విమ్మింగ్​, రన్నింగ్, సైక్లింగ్​, బ్రిస్క్​ వాకింగ్​ చేస్తే శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్​ యాక్టివ్​ అవుతుంది. అంతేకాదు క్యాన్సర్​ ముప్పు నుంచి కూడా కాపాడతాయి ఈ ఎక్సర్​సైజ్​లు అని  చెప్తున్నారు న్యూయార్క్​ యూనివర్సిటీ రీసెర్చర్లు. ఈ స్టడీ ప్రకారం ఏరోబిక్​ ఎక్సర్​సైజ్​లు చేసేటప్పుడు అడ్రినలిన్​ అనే హార్మోన్​ రిలీజ్​ అవుతుంది. ఇది ఇమ్యూనిటీ సిస్టమ్​లో వచ్చే మార్పుల్ని సరిచేస్తుంది. అంతేకాదు ‘సిడి8 టి’ సెల్స్​ సర్వైవల్​కి సాయం చేస్తుంది. ఇవి క్యాన్సర్​ కణాల్ని చంపేస్తాయి. వారంలో ఐదు రోజుల అరగంటసేపు ఏరోబిక్​ ఎక్సర్​సైజ్​ చేస్తే పాంక్రియాటిక్​​ క్యాన్సర్​ వచ్చే అవకాశం యాభై శాతం తగ్గుతుందంటున్నారు రీసెర్చర్లు.