ఒమిక్రాన్ ఎంట్రీతో ఐటీ  ఉద్యోగుల్లో టెన్షన్

ఒమిక్రాన్ ఎంట్రీతో ఐటీ  ఉద్యోగుల్లో టెన్షన్

కరోనా కారణంగా  ఐటీ  ఉద్యోగులు రెండేళ్ళుగా వర్క్ ఫ్రం హోమ్ లోనే పని చేస్తున్నారు. కానీ  పరిస్థితులు మెరుగుపడటంతో... వచ్చే ఏడాది జనవరి  చివరి వారం వరకూ అన్ని కంపెనీలు... ఫుల్ టైం వర్క్ ప్లేస్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఐటీ కారిడార్ పై ఎఫెక్ట్ చూపిస్తుందన్న భయంలో టెక్కీల్లో వ్యక్తమవుతోంది. 


హైదరాబాద్ లో 1200 సాఫ్ట్ వేర్ సంస్థలు ఉండగా...వీటిల్లో దాదాపు 6లక్షల మంది పనిచేస్తున్నారు. కరోనా వ్యాప్తి అడ్డుకోవడానికి ఐటీ ఎంప్లాయీస్ ఇళ్ళ నుంచే పనిచేస్తున్నారు. ఇప్పుడు వాక్సిన్ అందుబాటులోకి రావడంతో వచ్చే ఏడాది నుంచి ఆఫీస్ లో పనిచేయడానికి రెడీ అయ్యారు. ప్రభుత్వాలు కూడా భరోసా ఇవ్వడంతో కంపెనీలు తమ ఉద్యోగులకు కాల్ చేస్తున్నాయి. సరిగ్గా ఈ టైమ్ లోనే కొత్త వేరియంట్ బయటపడటం... కరోనా కేసులు పెరుగుతుండటంతో  ఉద్యోగులు భయపడుతున్నారు. దక్షిణాఫ్రికాలో ప్రారంభమైన ఒమిక్రాన్ తక్కువ టైమ్ లోనే ఇతర దేశాలకు పాకింది. దీంతో ఆయా దేశాల్లో మళ్ళీ కఠినమైన ఆంక్షలు విధించారు.  హైదరాబాద్ లోని ఐటీ కంపెనీలకు విదేశాల సంస్థలతో అనుసంధానం ఉంది. ఆఫీసుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని హెడ్డాఫీసుల నుంచి స్థానిక కంపెనీల HRలకు గైడ్ లైన్స్ వచ్చాయి. ఈ టైమ్ లో కొత్త వేరియంట్ బయటపడటంతో ఏం నిర్ణయం తీసుకోవాలని... ఐటీ కంపెనీలు డైలమాలో ఉన్నాయి.
మొన్నటి వరకు ఆఫీసులకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు... ఒమిక్రాన్ ఎంట్రీతో టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే కరోనా రెండు వేవ్స్ తో ఐటీ కారిడార్ లో చాలా మార్పులు జరిగాయి. వేల మంది ఉద్యోగాలు కోల్పోగా... మరికొందరు కొలువులు మానేసి ఊళ్ళకి వెళ్ళారు. ఇప్పుడు మరోసారి వైరస్ విజృంభిస్తే తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారు. కొన్ని సంస్థల నిర్వాహకులు మాత్రం... ఉద్యోగులకు భరోసా ఇస్తున్నారు. ఎంప్లాయీస్ తో పాటు.. వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా ఇచ్చి.. స్పెషల్ క్వారంటైన్ ఏర్పాటు చేస్తామంటున్నారు. 
బైట్: శ్రీనివాస్, ఐటీ కంపెనీ ప్రతినిధి.. 
ఎండ్ వాయిస్: ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో ఐటీ హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ లకు కూడా  హెల్త్ ప్యాకేజీలు అందించాలని కంపెనీలను డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు