ఇండియాలో ప్రపంచ వారసత్వ కట్టడాలు

ఇండియాలో ప్రపంచ వారసత్వ కట్టడాలు

ప్రజల్లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల పట్ల అవగాహన కల్పిస్తూ, వాటి సంరక్షణ  గురించి తెలియజేయడానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలను గుర్తిస్తుంది. మన దేశంలో రామప్ప, ధోలావీరాతో కలిపి మొత్తం 40 కట్టడాలకు ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. మొదటిసారి 1983లో అజంతా, ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్‌‌మహల్‌‌కు ఈ హోదా లభించింది. ఇండియాలోని ముఖ్యమైన వరల్డ్​ హెరిటేజ్​ సైట్స్​ గురించి ఈ వారం తెలుసుకుందాం..

తాజ్​మహల్​

ఢిల్లీలోని ఆగ్రా వద్ద ఉన్న ఈ స్మారక కట్టడాన్ని షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ పై ప్రేమకు గుర్తుగా నిర్మించాడు. మొఘల్​ నిర్మాణ శైలిలో 73 మీటర్ల ఎత్తుతో 1632 నుంచి 1653 వరకు దీన్ని నిర్మించారు. ఉస్తాద్​ అహ్మద్​ లౌరి వాస్తు శిల్పిగా పనిచేశారు.  

ఎల్లోరా గుహలు

మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో ఎల్లోరా గుహలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి సన్యాసుల ఆలయ సముదాయాలుగా ఇవి గుర్తింపు పొందాయి. చాళుక్య, రాష్ట్రకూట రాజ్యాలలో హిందూ మత వైభవాన్ని ఇవి కళ్లకు కడతాయి.

ఎలిఫెంటా గుహలు

ఎలిఫెంటా గుహలు ముంబై నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి ఎలిఫెంటా ద్వీపంలో తమదైన చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ప్రధాన గుహ గన్ కొండపై విస్తరించి ఉంది. 

కోణార్క్​ సూర్యదేవాలయం

కోణార్క్ సూర్యదేవాలయం ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఇది 13 వ శతాబ్దానికి చెందిన ఆలయం. సూర్య భగవానుడి కొరకు ఒక రథం ఆకారంలో 24 రథ చక్రాలతో, ఆరు గుర్రాలతో నిర్మించారు.

జంతర్​మంతర్​

జంతర్ మంతర్ ను యునెస్కో ఖగోళ నైపుణ్యాల గుట్టగా అభివర్ణించింది. రాజస్థాన్​లోని జైపూర్ లో జంతర్ మంతర్​ను 2వ మహారాజ జై సింగ్ నిర్మించిన అయిదు ఖగోళ నిర్మాణాలలో ఒకటి. 

చోళదేవాలయాలు

తమిళనాడులోని తంజావూర్ లో చోళ వంశ రాజులు నిర్మించిన బృహదీశ్వర ఆలయం, గంగై కొండ చోలీస్వరం టెంపుల్​, దరాసురంలోని ఐరావతేస్వర టెంపుల్స్​ 12వ శతాబ్దాల నాటివి. 

ఫతేపూర్​ సిక్రీ

యూపీలోని ఫతేపూర్ సిక్రీ ని అక్బర్ 16 వ శతాబ్దంలో నిర్మించాడు.14 సంవత్సరాల తర్వాత అక్కడ నీరు లేకపోవడంతో నిర్లక్ష్యంగా మారింది. 

రాణికి వావ్

గుజరాత్​లో 11 వ శతాబ్దపు రాజు భీమ్‌‌దేవ్ I కి తన వితంతువు రాణి ఉదయమతి స్మారకంగా మెట్టు బావి నిర్మించారు. ఇది ఏడు స్థాయి మెట్లతో విలోమ ఆలయం వలె రూపొందించబడింది.

ఖజురహో స్మారక కట్టడాలు

ధ్యప్రదేశ్​లో క్రీ.శ 11 వ శతాబ్దం నాటి హిందూ, జైన దేవాలయాలు క్లిష్టమైన వాస్తుశిల్పానికి ఖజురహో స్మారక కట్టడాలు ప్రసిద్ధి. ఈ ఆలయ సముదాయం శృంగార కళా శిల్పాలకు ప్రసిద్ది చెందింది.

కుతుబ్​మినార్​

ఢిల్లీలో కుతుబ్​మినార్​ నిర్మాణం 1193 లో ఢిల్లీని పరిపాలించిన కుతుబుద్దిన్​ ఐబక్​ ప్రారంభించగా, ఇల్​టుట్​మిష్​ పూర్తి చేశాడు. 

హుమాయూన్ సమాధి

హుమాయూన్ సమాధి మొఘల్ నిర్మాణాల సమూహం. ఢిల్లీలో ఆయన భార్య హమీదా బాను బేగం ఆదేశంతో నిర్మించారు.

భీంబెట్కా గుహలు

మధ్యప్రదేశ్​లో భీంబెట్కా గుహలు ఉన్నాయి. 30 వేల సంవత్సరాలకు పైగా పురాతనమైన డ్రాయింగ్, పెయింటింగ్స్​ ఎక్కువగా కనిపిస్తాయి. మొదటిసారి మానవుడి అవశేషాలు ఇక్కడ లభ్యం అయ్యాయి. 

స్మారక కట్టడాలు, హంపి

కర్ణాటకలోని హంపి పట్టణంలో విజయనగర రాజుల స్మారక కట్టడాలు ఉన్నాయి. 4,100 హెక్టార్ల స్థలంలో కోటలు, దేవాలయాలు సుమారు 1,600 కి పైగా నిర్మాణాల అవశేషాలు ఉన్నాయి.

మహాబలిపురం

క్రీ.శ 7వ శతాబ్దంలో  పల్లవ రాజులు మహాబలిపురం తమిళనాడులోని కంచి జిల్లాలో ఉంది. నరసింహా వర్మ 2 కాలంలో కట్టించిన స్మారక కట్టడాలు గొప్ప శిల్ప కళాకృతికి నిలయాలు.  

ధోలావీరా

భారత ప్రాచీన ప్రాంతమైన ధోలావీరాకు ఇటీవలే యునెస్కో గుర్తింపు దక్కింది. హరప్పా నాగరికత కాలంలో ఆధునిక నగరంగా ఉన్న ఈ ప్రాంతం గుజరాత్​లోని కచ్​ జిల్లాలో ఉంది. 120 ఎకరాల్లో  చతురస్రాకారంలో దీన్ని నిర్మించారు. 1967లో పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలు జరిపింది. ఇక్కడ లభ్యమైన శిలాశాసనాలు ప్రపంచంలోనే తొలి శాసనాలుగా భావిస్తారు. 

అజంతా గుహలు

అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఈ గుహల్లో ఉన్న 29 గుహాలయానలను  క్రీస్తుపూర్వం 2వ శతాబ్ధంలో నిర్మించారు. ఇవి తేరవాడ, మహాయాన బౌద్ధ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ఈ గుహల్లో దేశంలోనే అత్యుత్తమ బౌద్ధ కళలు ఉన్నాయి.

రామప్ప

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని 2020 సంవత్సరానికి ప్రపంచ స్థాయి కట్టడంగా యునెస్కో గుర్తించింది. భిన్న శైలి, శిల్పకళా నైపుణ్యం, టెక్నాలజీ తదితర ఎన్నో అరుదైన అర్హతలు ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపు పొందిన మొదటి కట్టడంగా రామప్ప నిలిచింది. ఈ ఆలయాన్ని క్రీ.శ 1213 లో కాకతీయ రాజైన గణపతిదేవుడి సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు ఇసుక పునాదులపై ని ర్మించారు. 

పర్వతం నాగార్జున
జాగ్రఫీ ఫ్యాకల్టీ