మాస్ లుక్ లో కనిపించనున్న ఆనంద్ దేవరకొండ

మాస్ లుక్ లో కనిపించనున్న ఆనంద్ దేవరకొండ

దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం లాంటి వెరైటీ కాన్సెప్టులతో మెప్పించిన ఆనంద్ దేవరకొండ.. ఈసారి మరో డిఫరెంట్‌‌‌‌ టైటిల్‌‌‌‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. ‘గం గం గణేశా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిన్న హైదరాబాద్​లో పూజా కార్యక్రమాలతో మూవీని స్టార్ట్ చేశారు. ఇదొక కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌ అని చెప్పిన దర్శకుడు.. ఇందులో ఆనంద్ దేవరకొండ మాస్ లుక్‌‌‌‌లో కనిపిస్తాడని హింట్ ఇచ్చాడు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.