నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ బడ్జెట్ను రూ.74.4 కోట్ల అంచనాలతో ప్రతిపాదించగా, కౌన్సిల్ ఏక్రగీవంగా ఆమోదించింది. మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు.
సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై, పలు సూచనలు చేశారు. బడ్జెట్లో రూ.74.2 కోట్ల అంచనా వ్యయాన్ని రూపొందించి, వార్డుల వారీగా కేటాయింపులు చేశారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ గణేశ్, వైస్ చైర్మన్ గంధం నరేందర్, కమిషనర్ కాటం భాస్కర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
