అడవి కేశవాపూర్ లో మధ్యాహ్న భోజన నాణ్యత పరిశీలన : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

అడవి కేశవాపూర్ లో మధ్యాహ్న భోజన నాణ్యత పరిశీలన : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ అర్బన్, వెలుగు: జనగామ మండలం అడవికేశ్వాపూర్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం అమలు వంటి అంశాలను పర్యవేక్షించారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి, వారి చదువు స్థాయి, పాఠ్యాంశాలపై అవగాహన గురించి పలు ప్రశ్నలు వేసి పరీక్షించారు. 

అనంతరం గ్రామ పంచాయతీలోని అంగన్​వాడీ కేంద్రాన్ని సందర్శించి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. చిన్నారులకు అందుతున్న పోషకాహారం, సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రాన్ని సందర్శించి బాధితులకు అందిస్తున్న కౌన్సెలింగ్, న్యాయ సహాయం, వైద్య సేవలు, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలపై ఆరా తీశారు.