ప్రియదర్శిని పార్కులో వజ్రోత్సవ వేడుకలు

ప్రియదర్శిని పార్కులో వజ్రోత్సవ వేడుకలు

భారత వజ్రోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ చెరువు కట్టపై ఉన్న ప్రియదర్శిని పార్కులో వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సంగీత వాయిద్య ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. సంగీత వాయిద్య విద్వాంసుల ప్రదర్శన మార్నింగ్ వాకర్స్ ను ఆకట్టుకుంది. సంగీత విద్వాంసులు, కళాకారులను డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి, స్థానికులు సత్కరించారు. 

 

సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి మున్సిపల్ పార్క్ లో భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. మార్నింగ్ వాకర్స్ కోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సంగీత వాయిద్య ప్రదర్శన చేశారు. మొండా డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపిక వేడుకల్లో పాల్గొన్నారు. మార్నింగ్ వాకర్స్ కోసం సిటీలోని 75 పార్కుల్లో జీహెచ్ఎంసీ సంగీత వాయిద్య ప్రదర్శన నిర్వహిస్తోంది. కేబీఆర్ పార్క్, వెంగళరావు పార్క్, పబ్లిక్ గార్డెన్ తదితర చోట్ల ఆహ్లాదపరిచే రీతిలో సంగీత వాయిద్య ప్రదర్శనలు మార్నింగ్ వాకర్స్ ను ఆకట్టుకున్నాయి.