పొట్టి బట్టల వల్లే మహిళలపై అఘాయిత్యాలు

పొట్టి బట్టల వల్లే మహిళలపై అఘాయిత్యాలు

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు వాళ్లు పొట్టి డ్రెస్సులు వేసుకోవడమే కారణమని ఇమ్రాన్ అనడం వివాదానికి కారణమైంది. యాక్సియోస్ ఆన్ హెచ్‌బీవోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్లు చేశారు. ‘మహిళలు పొట్టి బట్టలు వేసుకుంటే అది పురుషులపై తప్పకుండా ప్రభావం చూపుతుంది. ఒకవేళ మగాళ్లు రోబోలు కాకపోతే తప్ప పక్కాగా ప్రభావం పడుతుంది. ఇది కామన్‌సెన్స్‌కు సంబంధించిన విషయం. ఆడవాళ్ల అట్రాక్షన్ నుంచి మగాళ్లను దూరంగా ఉంచాలనేదే పర్దా కల్చర్‌‌ ప్రధాన ఉద్దేశం. మహిళల అట్రాక్షన్‌కు లొంగకుండా ఉండే ఆత్మస్థైర్యం అందరికీ ఉండదు’ అని సదరు ఇంటర్వ్యూలో ఇమ్రాన్ అన్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. విపక్ష నేతలతోపాటు జర్నలిస్టులు ఇమ్రాన్‌ను టార్గెట్‌ చేసుకొని కామెంట్లు చేస్తున్నారు. 

మహిళలపై లైంగిక వేధింపుల విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడిన తీరు తమను నిరాశపర్చిందని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్‌‌‌కు సౌత్ ఏషియాలో లీగల్ అడ్వయిజర్‌గా ఉన్న రీమా ఓమెర్ అన్నారు. ఇమ్రాన్ వ్యాఖ్యలు సరికాదని ఆమె మండిపడ్డారు.