కశ్మీర్ పై ఇమ్రాన్ ఖాన్ కు చిత్తశుద్ధి లేదు

కశ్మీర్ పై ఇమ్రాన్ ఖాన్ కు చిత్తశుద్ధి లేదు

భారత ప్రధాని మోడీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇద్దరూ ఒకే తరహాలో వ్యవహరిస్తున్నారని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో ఆరోపించారు. నిరంకుశ భావజాలంలో కశ్మీరీలను అణచివేసేందుకు మోడీ యత్నిస్తున్నారని… పాక్ లోని విపక్షాలను ఇదే రీతిలో అణచివేసేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ అంశంలో ఇమ్రాన్ కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు.

ఈద్ రోజున ఆజాద్ జమ్ముకశ్మీర్ కు ఇమ్రాన్ ఖాన్ వెళ్లలేదని… తన తరపున విదేశాంగ మంత్రి షా మెహ్మూద్ ఖురేషీని పంపించారన్నారు బిలావల్. కశ్మీర్ విషయంలో ఇమ్రాన్ కు ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇది చాలన్నారు. ఈ కష్ట కాలంలో ప్రతి పాకిస్తానీ మీ వెంటే ఉన్నారనే బలమైన సందేశాన్ని కశ్మీర్ ప్రజలకు పంపించాల్సిన అవసరం ఉందని  చెప్పారు. అవసరమైతే భారత్ తో యుద్ధానికి కూడా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు బిలావల్ భుట్టో.