
ఇస్లామాబాద్ : ఏ క్షణంలోనైనా ఇండియా దూకుడు ప్రదర్శిస్తే అడ్డుకోడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉండాలంటూ పాకిస్థాన్ ఆర్మీకి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్దేశించారు. పీఎం నేతృత్వంలోని నేషనల్ సెక్యూరిటీ కమిటీ(ఎన్ ఎస్ సీ ) బుధవారం అత్యవసరంగా సమా వేశమైం ది. పుల్వామా టెర్రర్ అటాక్ తర్వాత రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతపై ఎన్ ఎస్ సీ లోతుగా చర్చించింది. భేటీ అనంతరం ప్రధాని ఇమ్రాన్ ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.
‘ఇది నయా పాకిస్థాన్ . చేయని నేరాన్ని మనపై మోపుతున్న ఇండియా పొరపాటునగానీ దురాక్రమణకు దిగితే గట్టిగా ప్రతిఘటి స్తాం’ అని అందులో ఇమ్రాన్ పేర్కొన్నారు. హఫీజ్ షాక్: జమాతుల్ దవాపై బ్యాన్ లష్కరే తోయిబా వ్యస్థా పకుడు హఫీజ్ సయీద్ కు ఎదురుదెబ్బ తగిలింది. హఫీజ్ నడుపుతోన్న జమాత్ ఉల్ దవాసంస్థను నిషేధిస్తున్నట్లు పాక్ ప్రకటించింది.