హైదరాబాద్, వెలుగు: ఆసియాలోనే అతిపెద్ద మెటల్ ఫార్మింగ్ టెక్నాలజీ ప్రదర్శన ఐఎంటెక్స్ ఫార్మింగ్ 2026ను వచ్చే నెల నిర్వహిస్తున్నట్టు ఇండియన్ మెషీన్ టూల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐఎంటీయూఎంఏ) ప్రకటించింది.
బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (బీఐఈసీ) లో జనవరి 21 నుంచి 25 వరకు ఇది జరుగుతుంది. ఈ ప్రదర్శనలో 20 దేశాలకు చెందిన 600కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు. టూల్‌టెక్, అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్, వెల్డ్‌ఎక్స్‌పో, మోల్డెక్స్ ఇండియా, ఫాస్టెనెక్స్ ఇండియా వంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి.
ఫార్మింగ్ టెక్నాలజీపై సెమినార్, ఐ2 అకడెమియా స్క్వేర్, యూత్ ప్రోగ్రామ్ వంటివి ఉంటాయి. జర్మనీ, ఇటలీ, జపాన్, తైవాన్ లాంటి దేశాల ప్రదర్శనదారుల బృందాలు పాల్గొంటాయి. ఈ ప్రదర్శన స్వదేశీ ఉత్పత్తుల తయారీని వేగవంతం చేస్తుందని ఐఎంటీయూఎంఏ ప్రెసిడెంట్ మోహినీ కేల్కర్చెప్పారు.

