కాంగ్రెస్​ నాయకత్వంలోని కూటమిలో బీఆర్ఎస్​

కాంగ్రెస్​ నాయకత్వంలోని కూటమిలో బీఆర్ఎస్​

సీబీఐ, ఈడీ వంటి సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న విపక్షాలు..ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ నేతృత్వంలో 14 రాజకీయ పార్టీలు మార్చి 24, శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ ను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఏప్రిల్ 5న విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ ప్రత్యర్థులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయని పిటిషన్​లో విపక్షాలు ఆరోపించాయి. సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలో చేరితే..  వారిపై ఉన్న కేసులు ముగిసిపోతున్నాయని దుయ్యబట్టాయి. 

కాంగ్రెస్ సహా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతా దళ్ యునైటెడ్, భారత్ రాష్ట్ర సమితి, రాష్ట్రీయ జనతా దళ్, సమాజ్​వాదీ పార్టీ, శివసేన, నేషనల్ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, డీఎంకే పార్టీలు సంయుక్తంగా ఈ పిటిషన్ దాఖలు చేశాయి. మరోవైపు విపక్షాల ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. దర్యాప్తు ఏజెన్సీలు స్వతంత్రంగానే పనిచేస్తున్నాయని మరోసారి స్పష్టం చేసింది.