బీఈఎంఎల్​లో వాటా అమ్మకానికి కేంద్రం కసరత్తు

బీఈఎంఎల్​లో వాటా అమ్మకానికి కేంద్రం కసరత్తు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఎంఎల్​లిమిటెడ్​లో​(ఒకప్పుడు భారత్​ ఎర్త్ ​మూవర్స్​ లిమిటెడ్) వాటా అమ్మకానికి త్వరలోనే ఫైనాన్షియల్​బిడ్స్​ను ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. ఇది వరకే జనవరి 2021లో ఈ  ప్రభుత్వ రంగ యూనిట్‌‌‌‌లో 26 శాతం వాటాను విక్రయించడానికి కేంద్రం ప్రైమరీ బిడ్‌‌‌‌లను ఆహ్వానించింది. అప్పుడు కూడా పలు ఎక్స్​ప్రెషన్​ ఆఫ్​ ఇంట్రెస్ట్స్​ (ఈఓఐలు) వచ్చాయి.

దీని తరువాత, బీఈఎంఎల్​ తన నాన్-కోర్ వ్యాపారాలను బీఈఎంఎల్​ ల్యాండ్ అసెట్స్‌‌‌‌గా విడదీసి, కొత్త కంపెనీని 19 ఏప్రిల్ 2023న స్టాక్ మార్కెట్‌‌‌‌లో లిస్ట్​ చేసింది. బీఈఎంఎల్  నిర్మాణం,  రక్షణ సంబంధిత వ్యాపారం కోసం ఫైనాన్షియల్​ బిడ్లను పిలుస్తారని ఒక అధికారి చెప్పారు. "భూమి,  ఇతర నాన్-కోర్ ఆస్తుల  జాబితా తయారీ పూర్తయింది.   మేం త్వరలో నిర్మాణం,  రక్షణకు సంబంధించిన ప్రధాన ఆస్తుల కోసం ఫైనాన్షియల్​ బిడ్‌‌‌‌లను ఆహ్వానిస్తాం" అని ఆయన తెలిపారు. బీఈఎంఎల్ ... డిఫెన్స్ & ఏరోస్పేస్, మైనింగ్ & కన్స్ట్రక్షన్,  రైల్ & మెట్రోలకు ఉత్పత్తులను, సేవలను అందిస్తోంది.

విదేశీ క్లయింట్లతోనూ ఇది బిజినెస్​ చేస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈ ప్రభుత్వ రంగ సంస్థలో కేంద్రానికి ప్రస్తుతం 54.03 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం, బీఈఎంఎల్​లో ప్రభుత్వం  26 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఖజానాకు దాదాపు రూ.1,500 కోట్లు వస్తాయి.  డిసెంబర్ 31, 2022తో ముగిసిన క్వార్టర్​లో బీఈఎంఎల్​ లాభం 15.5 శాతం తగ్గి రూ.66.30 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్​లో కంపెనీ రూ.78.51 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని నమోదు చేసింది.  భారీ వస్తువులను తరలించడం, రైల్వేలు, రవాణా  మైనింగ్ కోసం ఉపయోగించే అనేక రకాల భారీ పరికరాలను తయారు చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.