కాలుష్య నగరాల్లో బీహార్ లోని బెగుసరాయ్.. బయటకు వెళ్తున్నారా ..మాస్క్ కంపల్సరీ

కాలుష్య నగరాల్లో బీహార్ లోని  బెగుసరాయ్.. బయటకు వెళ్తున్నారా ..మాస్క్ కంపల్సరీ

కాలుష్యం.. నేటి నగరజీవి దైనందిన జీవితంలో భాగమైపోయిన ఈ కాలుష్యం నుంచి ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పరిశోధకులు. ఎందుకంటే.. వాయు కాలుష్యం వల్ల గుండెనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఓ పరిశోధనా బృందం తేల్చింది. తాజాగా బిహార్ లోని బెగుసరాయ్ లో వాయు కాలుష్యం కారణంగా గుండె పోటు కేసులు పెరుగుతున్నాయి. 

కాలుష్య నగరాల్లో నివించే ప్రజలు మాస్క్ లు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  బిహార్ లోని బెగుసరాయ్ ను  అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చేర్చారు.  కమ్యూనిటి హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండె జబ్బుతో బాధ పడుతున్న పేషెంట్లు పెరిగారని తాజా నివేదికల ప్రకారం తెలుస్తోంది. 

బెగుసరాయ్ IMA సెక్రటరీ డాక్టర్ రంజన్ చౌదరి,   కార్డియాలజిస్ట్ నిపుణులు  తెలిపిన వివరాల ప్రకారం రోజు రోజుకు గుండె జబ్బు పేషంట్లు పెరుగుతున్నారు.  ఛాతీ నొప్పి, గొంతు నొప్పి, వెన్నునొప్పి, చెమటలు పట్టడం, రెండు చేతుల్లో నొప్పి వంటి లక్షణాలతో రోగులు ఆ స్పత్రికి వస్తున్నారని తెలిపారు.  ఈ లక్షణాలు గుండెపోటుకు దారితీస్తాయంటున్నారు వైద్యులు. వాయు కాలుష్యం వలన  హృదయ స్పందనలు, అలసట,  శ్వాస సమస్యలు వస్తాయి.   2023 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్  మూడు నెలల్లో హార్ట్ ఎటాక్  కారణంగా చాలామంది మరణించారని నివేదికలో పేర్కొన్నారు. కాలుష్యాన్ని అదుపుచేయకపోతే  మరణాల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.  

కాలుష్యనగరాల్లో నివసించే వారికి  ఛాతీ నొప్పి, గొంతు నొప్పి, వెన్నునొప్పి. రెండు చేతులలో నొప్పిని ఎదుర్కొంటుంటే వారు వెంటనే ఆసుపత్రికి వెళ్లి, చెక్-అప్ చేయించుకోవాలని ..  ECG (ఎలక్ట్రో కార్డియోగ్రామ్) చేయించుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాయు కాలుష్యం ప్రభావం భారతదేశంపై కూడా ఎక్కువగానే ఉంది. వాయు కాలుష్యంతో గుండెనొప్పి బారిన పడుతోంది నగరాల్లో నివసించే వారేనని పరిశోధనలు తేలుస్తున్నాయి.  కాబట్టి, ఓ నగరజీవీ.. స్వచ్ఛమైన గాలి కూడా నీకు కరవయ్యింది! పారా హుషార్! అంటున్నారు శాస్త్రవేత్తలు.