మాణిక్కం ఠాగూర్కు అనిరుధ్ రెడ్డి ఘాటు లేఖ 

మాణిక్కం ఠాగూర్కు అనిరుధ్ రెడ్డి ఘాటు లేఖ 

తెలంగాణ కాంగ్రెస్ లో నాయకుల అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డిపై చాలా మంది సీనియర్లు గుర్రుగా ఉన్నారు. వీలు చిక్కినప్పుడల్లా విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు జిల్లా నాయకుల మధ్య అంతర్గత కలహాలు కాకరేపుతున్నాయి. తాజాగా జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుల మధ్య విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. 

తెలంగాణ కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్కు జడ్చర్ల పార్టీ ఇన్చార్జ్ అనిరుధ్ రెడ్డి ఘాటు లేఖ రాశారు. జడ్జర్లలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై లేఖలో వివరించారు. ఈ నియోజకవర్గంలో ఎర్రశేఖర్ వ్యహారశైలిని తప్పుపడుతూ అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో పని చేసుకుంటూ వెళ్తున్న తనను ఎర్రశేఖర్ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తొమ్మిది మర్డర్ కేసుల్లో నిందితుడుగా ఉన్న ఎర్రశేఖర్ తో ఒకే వేదిక పంచుకోలేనంటూ లేఖలో పేర్కొన్నారు. సొంత తమ్ముడినే హత్య చేశాడనే ఆరోపణలను ఎర్ర శేఖర్ ఎదుర్కొంటున్నాడని లేఖలో ప్రస్తావించారు. కాంగ్రెస్ లో ఎర్రశేఖర్ చేరినప్పుడు పార్టీ పట్ల వినయ విధేయతలు ప్రదర్శించారని, ఇప్పుడు అతడి ప్రవర్తన మరోలా ఉందంటూ వివరించారు.