నువ్వు గ్రేట్ బాస్ : దున్నపోతుపై హెల్మెట్ రైడింగ్.. ఎందుకో తెలుసా..

నువ్వు గ్రేట్ బాస్ : దున్నపోతుపై హెల్మెట్ రైడింగ్.. ఎందుకో తెలుసా..

ఎప్పుడూ వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే ఢిల్లీరోడ్లపై ఓ వింత చోటు చేసుకుంది. ఓ వ్యక్తి  హెల్మెట్ పెట్టుకుని దున్నపోతుపై ప్రయాణిస్తున్నా కనిపంచాడు. ఇదంతా చూసిన  వాహనాలదారులు కొంచెం ఆశ్చర్యం.. ఇంత బిజీ ట్రాఫిక్ ఇదేం పనిరా బాబు అంటూ విసుక్కున్నట్లు కనిపిస్తోంది. యమధర్మరాజు బైక్ అయిన దున్నపోతుపై ప్రయాణిస్తున్న ఈ వ్యక్తి ఎవరు.. ఎందుకు ఇలా హెల్మెట్ పెట్టుకొని మరీ ఇలా ట్రాఫిక్ తో బిజీగా ఉండే ఢిల్లీ నగర వీధుల్లో ఎందుకు తిరుగుతున్నాడు అనేది చూసేవారికలిగే సందేహం. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే.. 

ఢిల్లీ ఎప్పుడూ బిజీగా ఉండే నగరం..అలాంటి ట్రాఫిక్ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఓ వ్యక్తి మెట్రో, బైక్, ఆటో, కారు..ఇవి కాకుండా దున్నపోతుపై ప్రయణిస్తుండటంతో అందరూ వింతగా చూశారు. స్వయంగా బుల్ రైడరే ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోతో పాటు పెరుగుతున్న పెట్రోల ధరను ప్రస్తావిస్తూ క్యాప్షన్ జోడించాడు. 

పెట్రోల్ ధరల గురించి ప్రస్తావన పక్కన పెడితే  ఈ వ్యక్తి దర్జాగా ఢిల్లీ వీధుల్లో దున్నపోతుపై స్వారీ చేస్తుండటం అందరిని ఆకట్టుకుంది. వచ్చీ పోయే వారంతా సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు.  ఓ పిల్లాడు ఏకంగా అతడితో కలిసి దున్నపోతుపై స్వారీ కూడా చేశాడు.  ఇక్కడ మరో వింత ఏంటంటే.. ఓ ట్రాఫిక్ పోలీస్ బైక్ ఈ దున్నపోతు రైడర్ కు ఎస్కాట్ ఇస్తున్నట్లుగా రావడం.  

పశువులపై రైడింగ్ ఇటీవల కాలంలోచాలా జరిగాయి. 2023 ప్రారంభంలో ఉత్తరాఖండ్ లో ఓ యువకుడు మద్యం మత్తులో ఎద్దుపై రైడ్ చేస్తూ అందరిని భయాందోళనకు గురి చేశాడు. వీడియాలో వైరల్ కావడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Also Read :- వచ్చే ఏడాది (2024) పబ్లిక్ హాలిడేస్ ఇవే : 27 రోజులు ఎంజాయ్

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72, ముంబైలో రూ. 106.31చెన్నైలో రూ. 102.63 గా విక్రయించబడుతోంది. 2022 మే నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని లీటరకు రూ. 8 నుంచి రూ. 6 చొప్పున  తగ్గించడంతో ఇంధన ధరల్లో స్పష్టమైన ఓదార్పునిచ్చే మార్పు కనిపించింది.