గోవాలో పేదలకు ఏటా రూ.72 వేలు ఇస్తం

గోవాలో పేదలకు ఏటా రూ.72 వేలు ఇస్తం

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి తమ పార్టీ సర్కారును ఏర్పాటు చేయబోతోందని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇక్కడ తామొక చారిత్రక నిర్ణయం తీసుకున్నామని, గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక ‘న్యాయ్’ స్కీమ్‌ను అమలు చేయబోతున్నామని చెప్పారు. గోవా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇవాళ వర్చువల్‌గా ప్రసంగించారు.

బీజేపీ అన్నింటిలోనూ ఫెయిల్

గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందిందని రాహుల్ గాంధీ అన్నారు. కొవిడ్ క్రైసిస్‌ను ఎదుర్కోవడంలో, గోవా టూరిజం అభివృద్ధిలో, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో బీజేపీ సర్కారు ఫెయిల్ అయిందని అన్నారు. బీజేపీ లాగా తాము పార్టీ ఫిరాయింపుదారులకు టికెట్లు  లేదని, ఈసారి కొత్త వ్యక్తులను పోటీలో నిలిపామని రాహుల్‌ చెప్పారు.

పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యనే

గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది కాంగ్రెస్ పార్టీనే అని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ పూర్తి మెజారిటీతో గెలపొందనుందన్నారు. పోటీ కేవలం కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ఉంటుందని, ఎవరూ తమ ఓట్లను వృథా చేసుకోవద్దని.. గోవాలో పోటీ చేస్తున్న ఆప్, తృణమూల్, ఎన్సీపీ, శివసేన లాంటి పార్టీల గురించి పరోక్షంగా ప్రస్తావించారు.  తమ పార్టీ గెలిచాక న్యాయ్ స్కీమ్‌ను అమలు చేస్తామని, గోవాలోని ప్రతి పేదవాడికి నెలకు రూ.6 వేల చొప్పున ఏడాదిలో రూ.72 వేలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్‌లోనే జమ చేస్తామని రాహుల్ చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

జడ్ కేటగిరీ సెక్యూరిటీపై స్పందించిన ఒవైసీ

రిపబ్లిక్‌ డే: తివిధ దళాల్లో బెస్ట్ పరేడ్‌ విన్నర్‌‌గా నేవీ

వాళ్లు ప్రజల పొట్ట కొట్టి సొంత ఖజానాలు నింపుకుంటరు