హైదరాబాద్ కాంగ్రెస్​ పార్టీలో నేతల మధ్య టికెట్లు, వర్గ పోరు

హైదరాబాద్ కాంగ్రెస్​ పార్టీలో నేతల మధ్య టికెట్లు, వర్గ పోరు

కాంగ్రెస్​ పార్టీలో నేతల మధ్య టికెట్లు, వర్గ పోరు మళ్లీ తీవ్రమైంది. లీడర్లు బహిరంగంగానే బాహాబాహీకి దిగుతున్నారు.. కలబడుతున్నారు. గాంధీభవన్​కు వచ్చి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. గోడలపై పోస్టర్లూ వేసుకుంటున్నారు. దాదాపు 20 నియోజకవర్గాల్లో గ్రూపు లొల్లులు ఎక్కువయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రూపు పంచాయితీలు ఇట్లనే కొనసాగితే.. టికెట్​ఇచ్చిన అభ్యర్థులకు ఎదుటివర్గం సహకరిస్తుందా? అని పార్టీ పెద్దల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లొల్లి పెట్టుకుంటున్న నేతలకు గాంధీభవన్​ నుంచి వార్నింగ్​లు వెళ్తున్నా.. నివురుగప్పిన నిప్పులా రాజుకుంటూనే ఉన్నది. 

ALSO READ:  ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: ఇన్​చార్జ్ భాస్కర్ గౌడ్

హైదరాబాద్​ సిటీ పరిధిలోని పలు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్​ లీడర్ల మధ్య పరిస్థితి కొట్టుకు నే దాకా వెళ్లింది. జూబ్లీహిల్స్​పరిధిలో టికెట్​ఆశిస్తున్న విష్ణువర్ధన్​ రెడ్డి, అజారుద్దీన్​ వర్గాల మధ్య నెల కింద గొడవ జరిగింది. విష్ణు ప్రత్యర్థి వర్గంతో అజారుద్దీన్​ సమావేశాలు నిర్వహిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. నెల కింద రహమత్​నగర్​లో అజారు ద్దీన్​ వర్గం మీటింగ్​ పెట్టింది. దీనికి తనను ఆహ్వానించలేదని విష్ణువర్ధన్​ రెడ్డి తన వర్గంతో అక్కడికి వెళ్లి.. అజారుద్దీన్​ను నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. 

ఉప్పల్​లో ఇటీవల రేవంత్​రెడ్డి పర్యటనలోనే లక్ష్మారెడ్డి, రజిత పరమేశ్వర్ ​రెడ్డి బాహాబాహీకి దిగారు. కార్పొరేటర్​ అయిన తమ నాయకుడి పేరు, ఫొటో పెట్టలేదంటూ లక్ష్మారెడ్డి వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని పరమేశ్వర్​రెడ్డి వర్గం చింపేసింది. దీంతో ఆ ఇద్దరు నేతల అనుచరులు కట్టెలతో కొట్టుకున్నారు. కుత్బుల్లాపూర్​లో నర్సారెడ్డి భూపతిరెడ్డి, కొలను హన్మంత్​ రెడ్డి ఎవరికివారు టికెట్​ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టేసుకున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మల్​రెడ్డి రంగారెడ్డి, దండెం రాంరెడ్డి అప్లికేషన్లప్పుడే తమ బల ప్రదర్శన చేశారు.