దళిత బంధు జాబితాపై ఆందోళనలు.. ఎంపీపీని నిలదీసిన మహిళలు

దళిత బంధు జాబితాపై ఆందోళనలు.. ఎంపీపీని నిలదీసిన మహిళలు

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్ పెట్ గ్రామంలో దళిత బంధు జాబితాపై దళిత మహిళలు ఆందోళన చేపట్టారు. వెల్గటూర్ ఎంపీపీ కూనమల్ల లక్ష్మిని దళిత మహిళలు నిలదీశారు. అనర్హులకు, ఆర్థికంగా ఉన్న వారికి దళిత బంధు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసింది ఇందుకేనా అని ఎంపీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు.

ఓట్లు వేసి గెలిపిస్తే కార్లు తీసుకుని, బంగ్లాలు కట్టుకుని దర్జాగా బతుకుతున్నారని దళితులు మండిపడ్డారు. వెంటనే దళితబంధు జాబితా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత వచ్చే జాబితాలో అందరికి వచ్చేలా చూస్తామని ఎంపీపీ హామీ ఇచ్చారు.