నిజామాబాద్లో జోరుగా నామినేషన్లు

నిజామాబాద్లో జోరుగా నామినేషన్లు

నిజామాబాద్, కామారెడ్డి, వెలుగు :  ఉమ్మడి జిల్లాలో మంగళవారం జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్మూర్​లో కాంగ్రెస్​అభ్యర్థిగా పొద్దుటూరి వినయ్​రెడ్డి, ప్రేమ్​కుమార్​(ధర్మ సమాజ్​పార్టీ), బోధన్​లో సయ్యద్​అస్గర్​(ఇండిపెండెంట్), జునైద్​ అహ్మద్​(ఇండిపెండెంట్)​ నామినేషన్లు వేశారు.

నిజామాబాద్​అర్బన్​లో రాగి అనిల్​ (ఇండిపెండెంట్), ఫజల్​కరీం (నేషనలిస్ట్​ కాంగ్రెస్), రాపెల్లి శ్రీనివాస్​(ఇండిపెండెంట్), రూరల్​లో తిరుపతిరెడ్డి (ఇండిపెండెంట్), బాజిరెడ్డి జగన్మోహన్​ (ఇండిపెండెంట్), కె.సుభాష్​(ధర్మసమాజ్),ఆర్.ప్రశాంత్​(ధర్మసమాజ్), బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్​ అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్​రెడ్డి, నీరడి ఈశ్వర్​ (బీఎస్పీ) నామినేషన్లు వేశారు. కామారెడ్డిలో ఆకుల హరీశ్, చిదుర సాగర్​రెడ్డి,  బుక్యా రవినాయక్, రాజగిరి సంతోష్​రెడ్డి, సపవత్​ సుమన్, మహ్మద్ తాహెర్​బిన్​ అహ్మద్​ ఇండిపెండెంట్లుగా నామినేషన్​వేశారు.  ఎల్లారెడ్డిలో పెద్ద మహేశ్​(ఇండిపెండెంట్)​, జుక్కల్​లో వాగ్మారే గంగాధర్ (ఇండిపెండెంట్)​ నామినేషన్లు వేశారు.