ఆర్మూర్, వెలుగు: మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ టౌన్ లోని ప్రసిద్ధ నవనాథ సిద్దులగుట్టపై శనివారం శివపార్వతుల కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ పురోహితులు నందీశ్వర మహారాజ్, కుమార్ శర్మ కల్యాణం జరిపించారు. ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ పాల్గొని పూజలు చేశారు.
ఆదివారం జరిగే శివరాత్రి ఉత్సవాల కోసం సిద్దులగుట్టను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. గుట్టపైన ఉన్న శివాలయం, రామాలయం, అయ్యప్ప ఆలయం, దత్తాత్రేయ ఆలయాలకు రంగులు వేశారు. భక్తుల సౌకర్యార్థం టెంట్లు వేయించారు. దారి పొడవున షామియానాలు వేసి తాగునీటి వసతి కల్పించారు.
