పాత గెస్ట్​ లెక్చరర్లకే మళ్లీ చాన్స్

పాత గెస్ట్​ లెక్చరర్లకే మళ్లీ చాన్స్
  • ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఉమర్ జలీల్

హైదరాబాద్, వెలుగు: సర్కారు జూనియర్ కాలేజీల్లో నిరుడు పనిచేసిన గెస్ట్ లెక్చరర్లను తిరిగి తీసుకోవాలని ఇంటర్మీడియేట్ కమిషనర్ ఉమర్ జలీల్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన డీఐఈఓలకు, కాలేజీ లెక్చరర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. పాతోళ్లకు అవకాశమిచ్చిన తర్వాత మిగిలిన ఖాళీ పోస్టుల్లో కొత్తవారి నుంచి అప్లికేషన్లు తీసుకొని, పీజీ మార్కుల ఆధారంగా భర్తీ చేయాలని సూచించారు.సెలెక్షన్ లిస్టును డీఐఈఓలకు పంపించాలని పేర్కొన్నారు. కాలేజీల రీఓపెన్ రోజైన సోమవారం గెస్ట్ ఫ్యాకల్టీ కాలేజీ ప్రిన్సిపళ్లకు రిపోర్టు చేయాలని సూచించారు. స్టేట్​వైడ్ గా1654 మంది గెస్టు లెక్చరర్లను తీసుకునేందుకు సర్కారు పర్మిషన్ ఇచ్చిందని వెల్లడించారు. కాగా పాత గెస్టు లెక్చరర్లకే అవకాశమివ్వడం పట్ల గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్, దార్ల భాస్కర్, గెస్ట్ లెక్చరర్ల జేఏసీ అధికార ప్రతినిధి దేవేందర్, గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాకుబ్ పాషా హర్షం వ్యక్తం చేశారు. రెన్యువల్ కు సహకరించిన మంత్రులు సబితారెడ్డి, హరీశ్​రావు, కమిషనర్ ఉమర్ జలీల్, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూధన్​రెడ్డి, ఇంటర్ విద్యాపరిరక్షణ సమితి కన్వీనర్ రామకృష్ణకు వారు కృతజ్ఞతలు చెప్పారు. కాగా ఇటీవల చనిపోయిన గెస్ట్​లెక్చరర్ల కుటుంబాలకు ఇంటర్ విద్యా జేఏసీ ఆఫీసులో సంతాపం తెలిపారు.